
14ఏళ్లు గాడిదలు కాశారా…?
చంద్రబాబుకు గజదొంగలముఠా, దుష్ట చతుష్టయం మాత్రమే అండగా ఉన్నారని, రాష్ట్రంలో పేదలు ఎవరు ఆయనతో లేరన్నారు. దుకాణం మూసేయడానికి సిద్దంగా ఉందని, పక్క రాష్ట్రంలో మ్యానిపెస్టో తెచ్చి బిసిబిళ్ల బాత్ వండాలని ఎద్దేవా, తాము ఏపీలో అమలు చేస్తున్న పథకాలను కిచిడి చేసి పులిహార వస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన 28ఏళ్ల తర్వాత.. 14ఏళ్లు సిఎంగా పని చేసిన బాబు, రాయలసీమ డిక్లరేషన్ అని చెబుతున్నాడని, 14ఏళ్లు ఏం గాడిదలు కాశాడన్నారు. ఇప్పుడు బిసిడిక్లరేషన్, ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ అని మొదలు పెట్టాడని, 14ఏళ్ల తర్వాత గ్యాస్ సిలిండర్ డిక్లరేషన్ అంటున్నాడని 14ఏళ్లు ఏం గాడిదలు కాశాయని ప్రశ్నించారు.