
బహిరంగ సభల షెడ్యూల్
- జూన్ 14న- కత్తిపూడి సభ
- జూన్ 16న- పిఠాపురంలో వారాహి యాత్ర, బహిరంగ సభ
- జూన్ 18న- కాకినాడలో వారాహి యాత్ర, బహిరంగ సభ
- జూన్ 20న-ముమ్మిడివరంలో వారాహి యాత్ర, బహిరంగ సభ
- జూన్ 21న-అమలాపురంలో వారాహి యాత్ర, బహిరంగ సభ
- జూన్ 22న-పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, మలికిపురంలో సభ
- జూన్ 23న-నరసాపురంలో వారాహి యాత్ర, బహిరంగ సభ
అమలాపురం డివిజన్ లో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30
జనసేనాని యాత్ర నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అమలాపురం పరిధిలో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 28 వరకు వపన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.