
Dhulipalla On Sajjala : టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఈ విమర్శలకు టీడీపీ నేత ధూళిపాల్ల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు. సజ్జల వ్యాఖ్యల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తుందని ధూళిపాళ్ల అన్నారు. సజ్జల లాంటి బడుగ నేతల బతుకుల లెక్కలు అన్నీ తేలుస్తాయన్నారు. లోకేష్ పై సజ్జల వ్యాఖ్యలపై ధూళిపాళ్ల. తండ్రి మృతదేహం పక్కన సంతకాలు సేకరించిన నీతిమాలిన నాయకత్వంలో పని చేస్తూ పుట్టుకల గురించి మీరు మాట్లాడితే జనం హర్షించారు. సైకో ఎవరో…ఎవరు మనస్తత్వ వైకల్యంతో బాధపడుతున్నారో…ఎవరి పుట్టుక రాష్ట్రానికి…సొంత కుటుంబానికి శాపంలా మారిందో యావత్తు రాష్ట్రానికి తెలుసని ఘాటుగా స్పందించారు. క్రిమినల్ కోసం క్రిమినల్ పనులు చేస్తున్న సజ్జల రేపు మూల్యం చెల్లించక తప్పదన్నారు. సజ్జల భవిష్యత్ దుర్భరంగా ఉండబోతుందని, అహంకారం కుప్ప కూల ఉంటుంది. అప్పుడు మీ లాంటి బడుగ నేతల బతుకుల లెక్క తేలుతుందని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అప్పుడు మీ బానిసత్వం, మీ పుట్టుక మీకే అసహ్యాన్ని కలిగిస్తుందని. క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లార్క్ సజ్జలకు త్వరలో ఉద్యోగం పోతుందని భయం పట్టుకుంది, ఆ ఫ్రస్టేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.