
ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు
విజయవాడలో దిగాల్సిన వారు 33 మంది, ఏలూరులో దిగాల్సిన వారు ఇద్దరు, తాడేపల్లిగూడెంలో ఒకరు, రాజమహేంద్రవరంలో 12 మంది రైల్వే శాఖ అధికారులు దిగారు. ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాలను విజయవాడ రైల్వే స్టేషన్‌లోని హెల్ప్‌లైన్ కేంద్రానికి రైల్వే అధికారులు పంపారు. వారు ఎక్కడున్నారో, ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు వాల్తేరు డీఆర్ఎం ఓ ప్రకటనలో ఉన్నారు. వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బాలేశ్వర్ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానుంది. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎంత మంది ఏపీ వాసులున్నారో ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. ఒడిశా రైలు ప్రమాదం కారణంగా విజయవాడ మీదుగా నడిచే 21 రైళ్లను అధికారులు నేడు, రేపు తాత్కాలికంగా రద్దు చేశారు. 11 రైళ్లను ఇతర మార్గాల్లోకి దారి మళ్లించారు.