[ad_1]
ఏపీకి చెందిన 48 మంది ప్రయాణికులు
విజయవాడలో దిగాల్సిన వారు 33 మంది, ఏలూరులో దిగాల్సిన వారు ఇద్దరు, తాడేపల్లిగూడెంలో ఒకరు, రాజమహేంద్రవరంలో 12 మంది రైల్వే శాఖ అధికారులు దిగారు. ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాలను విజయవాడ రైల్వే స్టేషన్‌లోని హెల్ప్‌లైన్ కేంద్రానికి రైల్వే అధికారులు పంపారు. వారు ఎక్కడున్నారో, ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం కారణంగా విజయవాడ మీదుగా నడిచే 21 రైళ్లను అధికారులు నేడు, రేపు తాత్కాలికంగా రద్దు చేశారు. 11 రైళ్లను ఇతర మార్గాల్లోకి దారి మళ్లించారు.
[ad_2]