[ad_1]
Telangana Formation Day Live Updates: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గోల్కొండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేడుకలు.
మూడోసారి కేసీఆరే.. ముమ్మాటికీ బీఆర్ఎస్దే అధికారం
బీఆర్ఎస్ నుంచి మూడోసారి సీఎం అభ్యర్థి ముమ్మాటికీ కేసీఆరేనని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థి ఎవరో చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్సేనని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దక్షిణాదిలో వరుసగా తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న అరుదైన రికార్డు సాధించిన కేసీఆర్కు కేటీఆర్కు అభినందనలు తెలియజేశారు.
జూన్ 22 వరకు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ ఒకదానిని నిర్వహిస్తున్నారు. జూన్ 3న రైతు శాఖా దినోత్సవం, 4న పోలీసు సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురాలు, 6న పారిశ్రామిక ఉత్సవం, ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్లలో సభలు, 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 112 తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 112 రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజన దినోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20 విద్యా దినోత్సవాలు, 21న ఆధ్యాత్మిక దినోత్సవం ప్రారంభోత్సవం, 22న అమరులకు నివాళులర్పించడం.
సచివాలయంలో విస్తృత ఏర్పాట్లు
దశాబ్ది వేడుకల కోసం సచివాలయంలో శాఖలవారిగా 13,398 మంది అధికారులను నియమించారు.అన్ని శాఖల నుంచి 7,250 మంది వేడుకలకు ఆహ్వానించారు. వారికోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు. వేడుకల సమన్వయం కోసం ప్రభుత్వం ఇప్పటికే నోడల్ అధికారులను కూడా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
విద్యుద్దీప కాంతుల్లో సచివాలయం
దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను అధికారులు విద్యుద్దీపాలతో అలంకరించారు. త్రివర్ణ విద్యుద్దీపకాంతులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం తళుకులీనుతోంది. అలాగే, 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని రంగు రంగుల లైట్లతో అలంకరించారు.
ఏ ఒక్క పార్టీతో రాష్ట్రం రాలేదు..
ఏ ఒక్క పార్టీతోనో, కుటుంబంతోనో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సమిష్టి పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు.
[ad_2]