[ad_1]
-2009 నవంబర్ 26న కేసీఆర్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరారు. మార్గమధ్యంలో దీక్షాస్థలికి వెళతారన్న ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్‌ను అక్కడే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కేసీఆర్ నేరుగా కరీంనగర్ వెళ్లారు. ఉత్తర తెలంగాణ భవనంలోనే 3 రోజులపాటు గడిపారు. 2009 నవంబర్ 29న పోలీసు బలగాలు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టాయి. వేలాదిమంది ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరారు. ఈ సందర్భంగా పోలీసులు, తెలంగాణ వాదుల మధ్య తోపులాట జరిగింది. కేసీఆర్ దీక్షాస్థలానికి బయల్దేరారు. పోలీసులు వ్యూహాత్మకంగా ప్రజలు, నేతల కళ్లుగప్పి కేసీఆర్ కాన్వాయ్‌ని ఖమ్మం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ దీనికి అడ్డు చెప్పి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కేసీఆర్‌ను తమ వాహనంలో ఖమ్మం తీసుకెళ్లారు. కేసీఆర్‌ను ఖమ్మం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు… ఆయనకు 14 రోజుల రిమాండు విధించారు. దీంతో కేసీఆర్‌ను జైలుకు తరలించారు.
[ad_2]