[ad_1]
కొత్త నిబంధనలు
వాహనాలకు సంబంధించి ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో BES -6(BS 6) ఉద్గార ప్రమాణాలను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్- 6 వాహనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సంవత్సరానికి క్రితమే కేంద్రం. వాహన తయారీ కంపెనీలు బీఎస్ 6 ప్రమాణాలతోనే తయారు చేయాలని సూచించింది. BES 4 వాహనాల వినియోగంతో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుండడం, అది వాతావరణంలో కలిసిపోయి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ ఉద్గార ప్రమాణాలను కేంద్రం అమలుచేస్తుంది. 2020లో బీఎస్-4 వాహనాల గ్రేటర్ హైదరాబాద్ పూర్తిగా నిలిపివేశారు. కేవలం బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలను మాత్రమే అనుమతించారు. ఈ నిబంధనలను దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణే, సూరత్, కాన్పూర్, షోలాపూర్, జంషెడ్ పూర్, ఆగ్రాలో అమలు చేస్తున్నారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసే వాహనాల్లో ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది.
[ad_2]