తెలంగాణ

సొంతూరిలో తెలంగాణ సీఎం కేసీఆర్

తన పురిటిగడ్డ అయిన సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. ఆయన రాకతో ఆ ఊర్లో పండుగ వాతావరణం నెలకొంది. అందరినీ అప్యాయంగా పలుకరించిన కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గుంట భూమి ఉన్న రైతుకు కూడా బీమా వర్తింపజేస్తున్నామని చెప్పారు. చింతమడక గ్రామం చుట్టూ చెరువులు ఉన్నాయని, మూడు పంటలు పండే గ్రామంగా చింతమడక తయారవుతుందన్నారు. రాష్ట్రంలో కరెంట్‌, నీటి సమస్యలు తీరాయని కేసీఆర్‌ అన్నారు.