తెలంగాణసినిమా

సమంత గర్భవతా?. తెలిస్తే నాకూ చెప్పండి

అగ్ర కథానాయిక సమంత తల్లి కాబోతున్నారా? అని తెగ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ ‘సమంత గర్భవతా?’ అంటూ కథనం రాసింది. ఆమె ట్విటర్‌లో ‘సమంత అక్కినేని’గా ఉన్న తన పేరును ‘బేబీ అక్కినేని’గా మార్చుకున్నారు. ‘ఓ బేబీ’ సినిమా ప్రచారంలో భాగంగా సామ్‌ ఇలా చేశారు. అయితే గత సినిమాల విడుదల సమయంలో ఆమె ఎప్పుడూ ఇలా ఖాతా పేరు మార్చలేదని, ఇప్పుడు మార్చడం వెనుక కారణం ఆమె గర్భవతి కావడమేనని ఊహిస్తూ రాసుకొచ్చారు. దీన్ని చూసిన సామ్‌ ట్విటర్‌లో స్పందించారు. తనదైన స్టైల్‌లో వదంతుల్ని ఖండించారు. ‘అయ్యో.. అవునా.. ఆమె గర్భవతా?.. మీకు తెలిసినప్పుడు మాకు కూడా చెప్పండి’ అని ట్వీట్‌ చేశారు. నటి రిప్లై చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. సామ్‌ సూపర్‌గా సమాధానం చెప్పారని అభిప్రాయపడ్డారు.

‘ఓ బేబీ’ సినిమా జులై 5న విడుదల కాబోతోంది. దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగశౌర్య, లక్ష్మి, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’కి తెలుగు రీమేక్ ఇది.