ఆంధ్రప్రదేశ్

విజయవాడ చేరుకున్న గవర్నర్‌ నరసింహన్‌

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌,  ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. దీనికోసమే ఆయన విజయవాడ చేరుకున్నారు.