తెలంగాణ

విచారణకు హాజరు కాలేను: నటుడు శివాజీ

అలంద మీడియా కేసులో గురువారం జరిగే విచారణకు హాజరు కాలేనని సినీ నటుడు శివాజీ తెలిపారు. గురువారం సైబరాబాద్‌ పోలీసుల ఎదుట విచారణ జరగనున్న నేపథ్యంలో హాజరు కాలేకపోతున్నట్టు మెయిల్‌ ద్వారా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున హాజరు కాలేనని పేర్కొన్నారు. అలంద మీడియా ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో శివాజీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా ఇచ్చారు. వారం క్రితం శివాజీ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా ఎల్‌వోసీ ఉండటంతో పోలీసులు అడ్డుకున్నారు.