ఆంధ్రప్రదేశ్క్రైమ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా వాసులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు,  ఆరు కార్లలో  వైకాపా నేతలు, అభిమానులు బుధవారం అర్ధరాత్రి అమరావతికి బయలుదేరారు. ఈ తెల్లవారుజామున తుని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే వైకాపా నేతలు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మాపురానికి చెందిన పప్పల నారాయణమూర్తి(69), గోరింట గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బీఎల్‌ నాయుడు(55) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.