క్రైమ్తెలంగాణ

రెండోరోజు రవిప్రకాశ్‌ను విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌: టీవీ 9 లోగోల విక్రయం కేసులో ఆసంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ వరుసగా రెండో రోజు బంజారాహిల్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. మొదటి రోజు ఏడుగంటల పాటు రవిప్రకాశ్‌ను విచారించిన పోలీసులు ఇవాళ కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశముంది. మొదటి మూడు రోజులు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రవిప్రకాశ్‌ను సంస్థ బదలాయింపు, సంతకాల ఫోర్జరీ కేసులో విచారించారు. లోగోల విక్రయం వ్యవహారంలో ఇవాళ మరింత లోతుగా ఆయన్ను ప్రశ్నించనున్నారు.