ఆంధ్రప్రదేశ్

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ముగిసింది. రాష్ట్ర రుణ ప్రణాళికకు సంబంధించి ఈ బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులు, వివిధ రంగాల వారికి రుణ ప్రణాళికలకు సంబంధించి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి బ్యాంకర్లతో చర్చించినట్టు సమాచారం. 2019-20కి సంబంధించి రాష్ట్ర రుణ ప్రణాళికను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ సమావేశానికి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.దాస్ తదితరులు హాజరయ్యారు.