తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే గట్టు బీముడు కన్నుమూత

గద్వాల్‌ మాజీ ఎమ్మెల్యే గట్టు బీముడు(65) తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను పదిరోజుల క్రితం కుటుంబ సభ్యులు నిమ్స్‌లో చేర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా తరఫున గద్వాల్‌ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఆయన విశ్వాసపాత్రునిగా ఉండేవారు. ప్రస్తుతం తెరాస నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తామని కుటుంబసభ్యులు తెలిపారు