తెలంగాణ

మాజీ ఎంపీలు వీహెచ్‌, హర్షకుమార్‌ అరెస్టు

పంజాగుట్ట నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు గతంలో కొందరు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం లారీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్లీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలతో పాటు వివిధ సంఘాల నాయకులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వీహెచ్‌, హర్షకుమార్‌తో పాటు అంబేడ్కర్‌ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుడిమల్ల వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నేతల అరెస్టు సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు.