తెలంగాణ

బోయిన్‌పల్లిలో 8వేల కిలోల వెండి పట్టివేత!

సికింద్రాబాద్‌ సమీపంలో భారీగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు 8వేల కిలోల వెండి కడ్డీలతో వెళ్తున్న కంటైనర్‌ను సీఐ రాజేష్‌ తన బృందంతో గుర్తించారు. లండన్‌ నుంచి వచ్చిన ఈ వెండిని చెన్నై నుంచి కంటైనర్‌లో హైదరాబాద్‌లోని వివిధ దుకాణాలకు విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వెండి కడ్డీల విలువ సుమారు రూ.35 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటికి బిల్లులు ఉన్నాయా? లేక అక్రమంగా తరలిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.