తెలంగాణ

డేటా చౌర్యం కేసులో అశోక్‌కు ముందస్తు బెయిల్‌

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కలకలం రేపిన డేటా చౌర్యం కేసులో ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఆధార్‌, ఇతర డేటా చోరీ చేశారన్న అభియోగంపై మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టును అప్పగించాలంటూ షరతులు విధించింది. అలాగే, రోజూ పోలీస్‌ స్టేషన్‌లో హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం అశోక్‌ను ఆదేశించింది.