క్రీడలు

టీమిండియా సత్తా మరోసారి రుజువైంది

ప్రపంచ కప్‌లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా తన మార్క్‌ చూపిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలను నమోదు చేసి జోరు మీదుంది. ఆదివారం ఓవల్‌ వేదికగా జరిగిన టీమిండియా-ఆసీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ధావన్‌ (117), రోహిత్‌(57) రాణించి టీమిండియా విజయానికి గట్టి పునాది వేశారు. టీమిండియా అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
*‘ఎంతో మజా వచ్చింది..!టీమిండియాకు శుభాకాంక్షలు. మ్యాచ్‌ మొత్తం మీద ఆధిపత్యం చెలాయించారు. కోహ్లీ సేనకిది సూపర్‌ విజయం’- వీరేంద్ర సెహ్వాగ్‌.
* ‘మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. బుమ్రా మీద ఉన్న అంచనాలన్నీ భువీ తన వైపు తిప్పుకొన్నాడు. ప్రమాదకర బ్యాట్స్‌మెన్ మాక్స్‌వెల్‌, వార్నర్‌ను చాహల్‌ పెవిలియన్‌కు చేర్చాడు. బుమ్రా ఎప్పటిలాగే అదరగొట్టాడు. ఇక బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్‌ అద్భుతం. ఇలాగే ఇక ముందు మ్యాచ్‌లను కొనసాగించండి. ఆల్‌ ది బెస్ట్‌ టీమిండియా’ -ఆకాశ్‌ చోప్రా.
*‘ ఆసీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా తన సత్తా ఏంటో చూపింది. చాలా బాగా ఆడారు. బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్‌ అద్భుతం. టీమిండియా సత్తా ఏంటో మరో సారి రుజువైంది’ – రవిచంద్రన్ అశ్విన్‌’.
* ‘ ఈ ఆదివారం నాకు అద్భుతంగా గడిచింది. అందుకే ఈ రోజు ఆలస్యంగా నిద్రపోయాను. నాతో పాటు నా కుమారుడిని నిద్రపుచ్చి నేను టీమిండియా మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేశాను. ఒకవైపు నాదల్‌ విజయం..మరోవైపు టీమిండియా మెరుపు ఇన్నింగ్స్‌.. అదిరిపోయింది. ఆల్‌ ది బెస్ట్‌ టీమిండియా’ –సానియా మీర్జా.
*‘ ఈ ఆదివారం పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌. టీమిండియాకు పవర్‌ ప్యాక్‌డ్‌ ఇన్నింగ్స్‌. బౌలర్స్‌, బ్యాట్స్‌మెన్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ సండే నాకు ఫన్‌డేలా గడిచింది. టీమిండియాకు శుభాకాంక్షలు’ – ప్రీతి జింటా.
*‘ టీమిండియా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. బుమ్రా, చాహల్‌, భువి నుంచి అద్భుతమైన ఎదురుదాడి. పాండ్య బ్యాటింగ్‌తో అదరగొట్టాడు’ –హర్భజన్‌ సింగ్‌.