క్రైమ్తెలంగాణ

టిక్‌టాక్‌ సరదా..హైదరాబాద్‌ యువకుడు మృతి

హైదరాబాద్‌: టిక్‌టాక్‌ సరదా మరో యువకుడి ప్రాణం తీసింది. ఆట విడుపు కోసం సరదాగా నగర శివారులోని దూలపల్లిలోని తుమార చెరువులో టిక్‌టాక్‌ యాప్‌ను అనుసరిస్తూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం దూలపల్లిలోని చెరువులో నరసింహ తన స్నేహితుడితో కలిసి బుధవారం టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా వీడియో చేసేందుకు చెరువులో దిగాడు. తన స్నేహితుడు ప్రశాంత్‌ గట్టుపైనే ఉండి చిత్రీకరిస్తున్నాడు. ఈ క్రమంలో టిక్‌టాక్‌ యాప్‌ను అనుసరిస్తున్న నరసింహ ప్రమాదవశాత్తు నీటిలో పడి ఈతరాక ప్రాణాలు కోల్పోయాడు. ప్రశాంత్‌ ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.