జాతీయం

టిక్‌టాక్‌ కోసం.. తలకిందులుగా గాల్లోకి ఎగిరి

టిక్‌టాక్‌ పిచ్చి.. ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ వీడియోలతో క్రేజ్‌ సంపాదించుకోవాలన్న కుతూహలంతో ప్రాణాలకు తెగించి మరీ కొందరు సాహసాలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన కుమార్‌ అనే యువకుడు టిక్‌టాక్‌ కోసం ఓ వీడియో రూపొందిస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. తలకిందులుగా గాల్లోకి ఎగిరే స్టంట్‌ బెడిసి కొట్టడంతో మెడ, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.