జాతీయం

గుండెపోటుతో మాజీ మంత్రి కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి శివనారాయణ్‌ మీనా కన్నుమూశారు. దైవ దర్శనార్థం కేదార్‌నాథ్‌ ప్రయాణంలో ఉన్న ఆయన గుండెపోటు కారణంగా ఈ బుధవారం స్వర్గస్తులైనారు. 1959లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శివనారాయణ్‌ జన్మించారు. ఈయన చచౌరా నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ హయాంలో మంత్రిగా ప్రజలకు సేవలందించారు. శివనారాయణ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. శివనారాయణ్‌ మీనా పార్థివ దేహం ఈ బుధవారం చచౌరా చేరుకోనుంది. గురువారం అంతిమ సంస్కారాలు జరిగే అవకాశం ఉంది.