ఆంధ్రప్రదేశ్క్రైమ్

కోడెల కుమార్తెపై కేసు

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం సాగించిన అరాచక పర్వం మరొకటి వెలుగు చూసింది. సోదరుడిని మించిన సోదరిగా కోడెల కుమార్తె అవినీతి వ్యవహారం బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్‌ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులు, అమాయకుల భూములపై కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కన్నేసి.. లేని వివాదాలను సృష్టించి ‘కే’ ట్యాక్స్‌ వసూలు చేశారు. కేసానుపల్లిలో రోడ్డు వెంట పద్మావతికి ఉన్న విలువైన ఎకరా భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్నుపడింది.