జాతీయం

కాగ్నిజెంట్‌ చేతికి జెనిత్‌ టెక్నాలజీస్‌..!

కాగ్నిజెంట్‌ తన వ్యాపారన్ని విస్తరించేందుకు జెనిత్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనుంది. డిజైనింగ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ఆపరేషన్స్‌ను నిర్వహించేదుకు, బయో ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగంలో ఐటీ సేవలకు విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపకరిస్తుందని భావిస్తోంది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికోసం జెనిత్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది.  డీల్‌ విలువను మాత్రం  కాగ్నిజెంట్‌ పేర్కొనలేదు. కాగ్నిజెంట్‌ సీఈవోగా బ్రయన్‌హాంప్రైజ్‌ వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కొనుగోలు ఇదే.
ఐర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే జెనిత్‌ టెక్నాలజీస్‌ లైఫ్‌సైన్స్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీస్‌ సర్వీస్‌ కంపెనీగా పేరుతెచ్చుకొంది. తమ లైఫ్‌సైన్స్‌ విభాగంలోకి మరింత మంది వినియోగదారులను చేర్చుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.