క్రైమ్

అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద లారీ దగ్ధం

అబ్దుల్లాపూర్‌ మెట్‌: నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో 65వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు లారీ దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం ఉదయం 6గంటల సమయంలో  విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్‌ లారీని రోడ్డు పక్కన నిలిపివేశాడు. డ్రైవర్‌ కిందకు దిగిన వెంటనే క్షణాల్లో లారీ మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొనే లోపే లారీ పూర్తిగా కాలిపోయింది.