politicalఆంధ్రప్రదేశ్

పోలవరం టెండర్లపై టీడీపీ ఎమ్మెల్సీ.. నారా లోకేష్ ట్వీట్

తుగ్లక్ గారు ఉన్నారా?విన్నారా?’ అంటూ పోలవరం టెండర్లపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ చేశారు. మీ తుగ్లక్ చర్యల కారణంగా ప్రాజెక్టు మరింత లేటవుతుందని ఆయన తెలిపారు. ‘‘తుగ్లక్ గారు ఉన్నారా?విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం. మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు లోక్‌సభలో చెప్పారు.

పోలవరం ప్రాజెక్టులో 2600 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటూ తలతిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ, సిడబ్ల్యుసి, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమయింది’’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.