క్రీడలు

సెమీస్ లో భారత్ ఘోర పరాజయం

India-vs-New-Zealand

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఐసిసి  ప్రపంచకప్  సెమీ ఫైనల్  మ్యాచ్ లో భారత్ పరాజయంపాలైంది. భారత్ న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ జరిగిన సెమీ ఫైనల్ లో హోరాహోరీగా సాగింది. మొదటగా టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్  మొత్తం 50 ఓవర్లలో 239 పరుగులు తీసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఆటగాళ్లు కాస్త పేలవంగా ఆడారు. 20 ఓవర్లలో 5 వికెట్లు  కోల్పోయి వందలోపే పరుగులు చేసింది. మధ్యలో ధోనీ, జడేజాలు బ్రహ్మాండమైన  ఆట  ్రపదర్శించినప్పటికీ 49.1 ఓవర్లలో 221 పరుగులు చేసి 18 పరుగుల  తేడాతో పరాజయంపాలై ఇంటిబాటపట్టింది.