Share this on your social network:
Published:
29-06-2020

హైదరాబాద్ లో లాక్ డౌన్ షూరూ...?

కరోనా వైరస్‌ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజువారీ వెయ్యికి సమీపిస్తుండడం, టెస్టుల పాజిటివ్‌ రేటు 30 శాతానికి ఎగబాకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండుమూడు రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గాన్ని సమావేశపరిచి జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలనే ప్రతిపాదనలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎక్కువ పాజిటివ్‌ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళన చెందాల్సిన పనిలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

Related ImagesRelated News


ఓటుకు 300.. 1.48 కోట్లు సీజ్‌

హైదరాబాద్‌: తమిళనాడులోని తేని జిల్లాలో ఆదాయపన్నుశాఖ అధికారులు 1.48 కోట


తెలంగాణలో... కరోనా కల'వర్రీ'..!

తెలంగాణలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. ప్రతి 100 టెస్టుల


తెలంగాణలో పదో తరగతి గ్రేడ్ల వెల్లడి

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా టెన్త్‌ పరీక్షలు రద్దు చేస


తెలంగాణపై కోరలు చాస్తున్న కరోనా

తెలంగాణపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం


తెలంగాణలో వైరస్ ఉద్ధృతి.. ఒక్కరోజులో ఇన్ని కేసులా..!

తెలంగాణలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతి రోజూ కేసులు రికార్డు స్థా


కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో దుకాణా బంద్

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సికి


తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 985 కొత్త


సచివాలయం కూల్చివేత హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.


అలనాటి అపురూప కట్టడం... తెలంగాణ సచివాలయం

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది


రాజకీయ నేతలను వెంటాడుతున్న కరోనా...!

తెలంగాణలో కరోనా వైరస్‌ రాజకీయ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ


కరోనాతో భయంవద్దు... చావులు తక్కువే : మంత్రి

కరోనాతో భయపడాల్సిన పనిలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేం


గిరిజన బాలిక అత్యాచారం, హత్య చేసినవారిన వెంటనే శిక్షించాలి

ఇటీవలె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో జరిగిన గిరిజన యువతిపై అత్


హైదరాబాద్ లో లాక్ డౌన్ షూరూ...?

కరోనా వైరస్‌ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ మహానగర


ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా ...

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత


పారిశ్రామిక జిల్లాను వణికిస్తున్న కరోనా

పారిశ్రామిక జిల్లా అయిన పెద్దపల్లి జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద న


ఆ నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలి

వికారాబాద్ జిల్లా తాండూర్  గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు


లాక్డౌన్ 2.0 ఎఫెక్ట్: ఊళ్లకు పయనమైన ఆంధ్రా జనం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవు


మాజీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ


ఆన్ లైన్ తరగతులపై రెండురోజుల్లో వివరణ ఇవ్వండి

ప్రైవేట్ పాఠశాలలో ఆన్‌లైన్ తరగతులు నిషేధించాలన్న పిల్‌పై తెలంగాణ హ


తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతం.. రికార్డు స్థాయిలో కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,21


విద్యుత్ షాక్ కు రైతు మృతి

సంగారెడ్డి జిల్లా నాగలి గిద్ద మండలంలోని గొందేగావ్ గ్రామంలో విషాదం చో