Share this on your social network:
Published:
29-06-2020

అలనాటి అపురూప కట్టడం... తెలంగాణ సచివాలయం


తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసింది. గతంలో సచివాలయం కూల్చివేతను ఆపేయాలంటూ వేర్వేరుగా దాఖలైన 10 పిటీషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవిచింది. దీంతో నూతన సచివాలయం నిర్మాణానికి అనుమతిచ్చింది. కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చేసింది. సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ వచ్చిన పిటీషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

చరిత్ర:

నిజాం నవాబుల పాలనలో కట్టిన గొప్పకట్టడం. ప్రస్తుతం సచివాలయంగా పిలవబడుతున్న ఈ కట్టడాన్ని పూర్వం పేషీ లేదా జీ-బ్లాక్‌ అని పిలిచేవారు. సచివాలయంను 10 బ్లాకులుగా విభజించారు. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత హైదరాబాద్‌ రాష్ట్రంను కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆంధ్ర రాష్ట్రం రాజధానిగా కర్నూల్‌ ఉండేది. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని కలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ ను ఏర్పాటు చేశారు. పూర్వం నిజాం పాలనలో హైదరాబాద్‌ ఉండటంతో ఇక్కడి పురాతన కట్టడాలను దృష్టిలోపెట్టుకుని రాజకీయ పెద్దల సలహాల మేరకు ప్రభుత్వం హైదరాబాద్‌ ను ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఏర్పాటు చేసింది. అప్పటినుండి 25.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ కట్టడాన్ని రాష్ట్ర సచివాలయంగా కొనసాగుతోంది

. 2014లో రాష్ట్రం రెండుగా విడిపోవడంతో 58:42 నిష్పత్తిలో సచివాలయంను విభజించి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని చేసి హైదరాబాద్‌ నుండి అమరావతికి సచివాలయాన్ని తరలించారు. అప్పటినుండి తెలంగాణ సచివాలయంగా హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున్న ఉన్న ఈ పేషీ భవనం కొనసాగుతోంది. గత ఏడాది సచివాలయంను కూల్చివేసి వేరే ప్రాంతంలో కట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సచివాలయం కూల్చివేతను ఆపాలంటూ పలువురు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేసిన హైకోర్టు నేడు నూతన సచివాలయం నిర్మాణంతోపాటు ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. 

                                        -- జోనా బి రామారావు, ఇంటర్నెట్ డెస్క్.

Related ImagesRelated News


ఓటుకు 300.. 1.48 కోట్లు సీజ్‌

హైదరాబాద్‌: తమిళనాడులోని తేని జిల్లాలో ఆదాయపన్నుశాఖ అధికారులు 1.48 కోట


తెలంగాణలో... కరోనా కల'వర్రీ'..!

తెలంగాణలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. ప్రతి 100 టెస్టుల


తెలంగాణలో పదో తరగతి గ్రేడ్ల వెల్లడి

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా టెన్త్‌ పరీక్షలు రద్దు చేస


తెలంగాణపై కోరలు చాస్తున్న కరోనా

తెలంగాణపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం


తెలంగాణలో వైరస్ ఉద్ధృతి.. ఒక్కరోజులో ఇన్ని కేసులా..!

తెలంగాణలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతి రోజూ కేసులు రికార్డు స్థా


కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో దుకాణా బంద్

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సికి


తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 985 కొత్త


సచివాలయం కూల్చివేత హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.


అలనాటి అపురూప కట్టడం... తెలంగాణ సచివాలయం

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది


రాజకీయ నేతలను వెంటాడుతున్న కరోనా...!

తెలంగాణలో కరోనా వైరస్‌ రాజకీయ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ


కరోనాతో భయంవద్దు... చావులు తక్కువే : మంత్రి

కరోనాతో భయపడాల్సిన పనిలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేం


గిరిజన బాలిక అత్యాచారం, హత్య చేసినవారిన వెంటనే శిక్షించాలి

ఇటీవలె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో జరిగిన గిరిజన యువతిపై అత్


హైదరాబాద్ లో లాక్ డౌన్ షూరూ...?

కరోనా వైరస్‌ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ మహానగర


ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా ...

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత


పారిశ్రామిక జిల్లాను వణికిస్తున్న కరోనా

పారిశ్రామిక జిల్లా అయిన పెద్దపల్లి జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద న


ఆ నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలి

వికారాబాద్ జిల్లా తాండూర్  గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు


లాక్డౌన్ 2.0 ఎఫెక్ట్: ఊళ్లకు పయనమైన ఆంధ్రా జనం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవు


మాజీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ


ఆన్ లైన్ తరగతులపై రెండురోజుల్లో వివరణ ఇవ్వండి

ప్రైవేట్ పాఠశాలలో ఆన్‌లైన్ తరగతులు నిషేధించాలన్న పిల్‌పై తెలంగాణ హ


తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతం.. రికార్డు స్థాయిలో కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,21


విద్యుత్ షాక్ కు రైతు మృతి

సంగారెడ్డి జిల్లా నాగలి గిద్ద మండలంలోని గొందేగావ్ గ్రామంలో విషాదం చో