politicalజాతీయం

దివికేగిన ఢిల్లీ దీదీ

Sheila Dikshit passedaway

ఢిల్లీ: ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. దిల్లీ అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారని కొనియాడారు. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత షీలా దీక్షిత్​ కన్నుమూశారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1998 నుంచి 2013 వరకు దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా… పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలో జన్మించారు. దిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం జరిగింది. దిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుంచి ఎంఏ హిస్టరీలో పట్టభద్రులు అయ్యారు. ఉత్తర ప్రదేశ్​లోని ఉన్నావ్​ జిల్లాకు చెందిన ఐఏఎస్​ వినోద్ దీక్షిత్​తో ఈమె వివాహం జరిగింది.1984లో ఉత్తరప్రదేశ్ కనౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 1998లో లోక్​సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత దిల్లీ రాజకీయాలకు పరిమితమయ్యారు షీలా.

Sheila Dikshit, Three-Time Delhi Chief Minister, Dies At 81