ఆంధ్రప్రదేశ్క్రైమ్

సంగం డైరీలో భారీ చోరీ…

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని దక్షిణ భారత ప్రసిద్ధి గాంచిన సంగం డైరీలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో 44 లక్షల 43 వేల రూపాయలు నగదు చోరీ అయినట్లు సంగం డైరీ వర్గాలు గుర్తించాయి. సంగం డైరీకి లావాదేవీలుకు సంబంధించిన నగదు బీరువాలో ఉంచామని, ఆ నగదులో రూ 44 లక్షల 43 వేలు చోరీకి గురైందని డైరీ ఎండి గోపాలకృష్ణ తెలిపారు. డైరీలో జరిగిన చోరీపై చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎండి గోపాలకృష్ణ పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని చేబ్రోలు సిఐ శ్రీనివాసరావు పరిశీలించారు.