ఆంధ్రప్రదేశ్

అక్కడ కొలువైన వినాయకుణ్ని దర్శించుకునేందుకు యువత ఆసక్తిని


దంతేవాడ(స్నేహ టీవీ): అక్కడ కొలువైన వినాయకుణ్ని దర్శించుకునేందుకు యువత అమితమైన ఆసక్తిని చూపించడంతోపాటు, ట్రెక్కింగ్ వినోదాన్ని కూడా పంచుకుంటోంది. ఇంతేకాదు హెరిటేజ్ వాక్ పేరిట కొండ దిగువ ప్రాంతంలో రాత్రంతా గడిపేందుకు సిద్ధమవుతోంది. దీనికి స్థానిక పాలనా యంత్రాంగం సైతం సహకారం అందిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో కొలువైన ఈ గణేశుడు సముద్ర మట్టానికి వేలఅడుగుల ఎత్తుపైన డోల్కల్ కొండమీద వెలుగొందుతున్నాడు. ఈ వినాయకుణ్ని దర్శించేందుకు వందలమంది యాత్రికులు వస్తుంటారు. ఈసారి గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ తాకిడి మరింత ఎక్కువైంది. ఈ నేపధ్యంలో కొండ కింద యాత్రికులకోసం వసతి ఏర్పాట్లతో పాటు ఆహార పానీయాలకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన టెంట్లలో తగిన రుసుము చెల్లించి బస చేయవచ్చు. ఇక్కడికి గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన యువత అధికసంఖ్యలో వస్తోంది. వీరు గణేశుణ్ని దర్శించుకోవడంతో పాటు, పర్వతాలు ఎక్కాలన్న తమ అభిరుచినికూడా నెరవేర్చుకుంటున్నారు