తెలంగాణవ్యాపారం

3 రూపాయలకే చీర..

స్నేహ టీవీ, వరంగల్‌ : కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌ తెలుసా? ఆ షాపింగ్‌ మాల్‌లో కేవలం 3 రూపాయిలకే ఒక చీర ఇస్తున్నారంట. వరంగల్‌, ఆ చుట్టుపక్కల ఆడవాళ్లంతా ప్రస్తుతం చెప్పుకునే ముచ్చట ఇదే. ముచ్చటతో ఆపారా ఏమిటి? చకాచకా రెడీ అయిపోయి, షాపింగ్‌ మాల్‌కు పరిగెత్తారు. ఇలా వరంగల్, ఆ చుట్టుపక్కల గ్రామాల ఆడవాళ్లందరూ కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌లోనే. దీంతో షాపింగ్‌ మాల్‌ ఒక్కసారిగా మహిళలతో కిక్కిరిసిపోయింది.

3 రూపాయల చీరను సొంతం చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున్న పోటెత్తారు. దీంతో కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏంట్రా బాబు ఇంతమంది ఆడవాళ్లా..! అని నోర్లు వెళ్లబెట్టిన షాపింగ్‌ మాల్‌ సిబ్బంది, పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులకు ఫోన్‌ చేశారు. షాపింగ్‌ మాల్‌ను మూసివేశారు. కానీ అప్పటికే పరిస్థితి అంతా చేదాటిపోయింది. ఆఫర్లు ప్రకటించి, షాపింగ్‌ మాల్‌ మూసివేయడంపై మహిళలు తిరగబడ్డారు. ఏం చేయాలో పాలుపోలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు..