తెలంగాణ

29న సీపీజీఈటీ ప్రకటన

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలోని ఏడు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) 2019 ప్రకటన సోమవారం జారీ కానుంది. ఈ మేరకు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో అడ్మిషన్‌ కోసం మొదటిసారిగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.