క్రైమ్

తండ్రే కొడుకును చంపినందుకు హత్య చేశాడు..

అత్తాపూర్‌లో ఇవాళ  పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. జుమెరాత్‌ బజార్‌కు చెందిన రమేష్‌ని గొడ్డలితో నరికి అతిదారుణంగా చంపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. 10 నెలల కిందట శంషాబాద్‌లో జరిగిన మహేష్‌ గౌడ్‌​ హత్య కేసులో రమేష్‌ ప్రధాన నిందితుడు. తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో రమేష్‌.. 6 నెలల క్రితం మహేష్‌ను హత్య చేశాడు.‌ ఆ కేసులో అరెస్టయి అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కేసు విచారణలో భాగంగానే రమేష్‌ ఇవాళ ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరయ్యాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మహేష్‌ తండ్రి.. అదనుచూసి రమేష్‌ను హత్య చేశాడు. స్థానికులు, పోలీసులు కలిసి హత్య చేసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పట్టుకుని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. హత్యతో ప్రమేయమున్న మరో ఇద్దరు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు.