తెలంగాణ

15న దోస్త్ నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లింపులు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇవాళ సమీక్ష నిర్వహించారు. డిగ్రీలో ప్రవేశానికి ఈ నెల 15న దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి దోస్త్ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే కళాశాలలకు ఫీజు చెల్లింపు, రిపోర్టు చేసే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. జులై 1వ తేదీన డిగ్రీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని వర్సిటీల పరిధిలో విద్యాసంవత్సరం షెడ్యూల్ ఒకేలా ఉండాలని నిర్ణయించారు.