ఆంధ్రప్రదేశ్

12 ఏళ్ల విద్యార్థిని జనసేన పార్టీకి విరాళం..

పశ్చిమగోదావరి జిల్లా బొట్టాయిగూడెం ప్రాంతానికి చందిన సాయి తేజస్వి అనే 12 ఏళ్ల విద్యార్థిని జనసేన పార్టీకి రూ.1300 విరాళాన్ని అందజేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు తాను దాచుకున్న మొత్తాన్ని అందజేసింది. సాయితేజస్వి సామాజిక స్పృహకు ముగ్ధుడైన పవన్‌.. రూ.1300లో కేవలం రూ.11 తీసుకుని మిగతా నగదు ఆమెకే తిరిగి ఇచ్చేశారు.