తెలంగాణ

హైదరాబాద్‌లో హనుమాన్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో తలపెట్టిన శోభాయాత్ర కొనసాగుతోంది. విశ్వ హిందూ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రలో పెద్ద ఎత్తున భక్తులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. 12.5 కిలోమీటర్లు జరిగే శోభాయాత్రకు 12 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 450 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు హనుమాన్‌ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ తాడ్బండ్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు