క్రైమ్తెలంగాణ

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

బేగంబజార్‌: హైదరాబాద్‌ ఎంజే మార్కెట్‌ సమీపంలోని హిందీనగర్‌లోని ఓ ఫర్నిచర్‌ గోదాములో బుధవారం  మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు భయంతో పరుగులు తీశారు. బేగంబజారు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని గౌలీగూడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సుమారు నాలుగు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ  ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని పేర్కొన్నారు. బేగం బజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.