జాతీయం

హిట్‌ అండ్‌ రన్‌ : రేడియో జాకీ అరెస్ట్‌

లోక్‌జనశక్తి పార్టీ కార్యకర్త మృతికి కారణమైన కేసులో రేడియో జాకీ (ఆర్‌జే) అంకిత్‌ గులాటిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఆర్‌జేని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేడియో సిటీ ఆర్‌జే అంకిత్ గులాటి తన కారును వేగంగా నడుపుతూ  ఎల్‌జేపీ కార్యకర్త  కార్యకర్త ధీరజ్‌కుమార్‌ బైక్‌ను ఢీకొట్టాడు.  దీంతో తీవ్ర గాయాలతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం తెల్లవారుజామున  ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  అయితే ప్రమాద స్థలంనుంచి పారిపోయిన గులాటిని శుక్రవారం రాత్రి  అరెస్ట్‌ చేశామని  పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మృతుడి కుటుంబ సభ్యులను   పరామర్శించారు.  ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.