క్రైమ్

హాజీపూర్‌ సైకోకు ముగిసిన కస్టడీ

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వరుస హత్య కేసుల నిందితుడిని తిరిగి రిమాండ్‌కు తరలించారు. బాలికలు శ్రావణి, మనీషా, కల్పనను అతి కిరాతకంగా హత్య చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడైన మర్రి శ్రీనివాస్ రెడ్డిని.. ఈ నెల 8న పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదవడంతో కస్టడీ కోసం నల్గొండలోని మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ ఈ నెల 8న కోర్టు రాచకొండ కమిషనరేట్ పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఆ రోజు నుంచి రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో విచారణ నిర్వహించిన తర్వాత.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ప్రత్యేక భద్రత నడుమ వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.