జాతీయం

హలో బాబూ..నేను రాహుల్‌ గాంధీని..!

కన్నూర్‌: ఈ ఏడేళ్ల బుడతడి పేరు నందన్‌. కేరళకు చెందిన ఈ చిన్నారికి కాంగ్రెస్‌ అద్యక్షుడు రాహుల్‌ గాంధీ అంటే ఎంతో అభిమానం. తను అంతగా అభిమానించే రాహుల్‌ కన్నూర్‌కు వస్తున్నారని తెలియడంతో ఎంతో సంబరపడ్డాడు. ఎలాగైనా అయన్ని నేరుగా చూడాలనుకుని తహతహలాడాడు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం జరగనున్న ఆడిటోరియం దగ్గరకు తల్లిదండ్రులతో కలిసి ఉదయం 5 గంటలకే చేరుకున్నాడు. ఇటీవల జరిగిన ఈ సమావేశానికి రాహుల్‌ 9 గంటలకు వచ్చారు. తన అభిమాన నేతను కలిసేందుకు ప్రయత్నించిన నందన్‌కు రాహుల్‌ వ్యక్తిగత భద్రతాధికారులు అనుమతి నిరాకరించారు. సమావేశం పూర్తయిన వెంటనే రాహుల్‌ అక్కడి నుంచి వెళ్లపోయారు. అప్పటికే 5 గంటలు వేచి ఉన్న నందన్‌ నిరాశతో ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని నందన్‌ తండ్రి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అది కాస్తా కాంగ్రెస్ నాయకుల కంట పడడంతో నేరుగా రాహుల్‌కు విషయం తెలిసింది.