తెలంగాణ

హబ్సిగూడలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ

హైదరాబాద్‌; హైదరాబాద్‌లో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా హబ్సిగూడలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ 70 వసంతాలు పూర్తి చేసుకుందని హబ్సిగూడ ఏబీవీపీ ఇంచార్జ్‌ వెంకటేష్‌ చారి తెలిపారు. విద్యారంగ సమస్యలపై పోరాడుతూ.. ఫీజ్‌ రియంబర్స్‌ మెంట్‌ విడుదల కోసం అనేక ఉద్యమాలు చేసిందని, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్‌, విద్యారంగాలలో మార్పులకై ఉద్యమిస్తామని ఇంచార్జ్‌ వెంకటేష్‌ చారి అన్నారు.