క్రైమ్తెలంగాణ

హత్య కు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ డైరీలో ఏముంది?

మిర్యాలగూడ (నల్గొండ) : ‘‘అంకుల్‌ నేను మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌.. మీరు మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలో ఉండే ఫర్‌ఫెక్ట్‌ లక్షణాలు ఏవి ఉండాలని కోరుకుంటున్నారో… ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి’’. అని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య కు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ తన డైరీలో రాసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రణయ్‌కి డైరీ రాసే అలవాటు ఉండడం వల్ల తాను అమృతను ప్రేమించిన విషయాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే విషయాలు రాసుకున్నట్లు తెలుస్తోంది.

కులం, ఆస్తిపాస్తులు చూసి ప్రేమికులను విడదీయరాదని, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికే అని ప్రణయ్‌ డైరీలో రాసుకున్నాడు. మద్యం, సిగరెట్‌ ఇతర చెడు అలవాట్లు ఉన్న వారిని రిజక్ట్‌ చేయాలని, చెడు అలవాట్లు ఉంటే ఆ అబ్బాయిని తిరస్కరించాలని కూడా డైరీలో రాసుకున్నట్లు తెలు స్తోంది. ఆస్తిపాస్తులు లేకున్నా మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానని డైరీలో రాసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది..