జాతీయంవ్యాపారం

స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: తొలి విడత ఎన్నికలు ప్రారంభమైన వేళ దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 46 పాయింట్ల లాభంతో 38,585 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 11,601 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.14 వద్ద కొనసాగుతోంది.

ఐఓసీ, విప్రో, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యెస్‌ బ్యాంక్‌, హీరో మోటార్‌ కార్ప్‌ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా… సన్‌ ఫార్మా, వేదాంత, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, సిప్లా, హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.