క్రీడలు

సైనా నెహ్వాల్‌ పెళ్లిపీటలెక్కబోతుంది..

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పెళ్లిపీటలెక్కబోతుంది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌తో సైనా వివాహం జరగనుందని సమాచారం. ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమలో  ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబ పెద్దలు అంగీకారం తెలిపారు. తాజాగా వివాహ తేదీని కూడా ఫిక్స్ చేశారట. డిసెంబర్ 16న వివాహం జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి కొద్ది మంది సమక్షంలోనే  జరుపుకోనున్నట్లు సమాచారం. డిసెంబర్ 21న రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవ్వనున్నారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారులైన సైనా, కశ్యప్‌లు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో 2005లో మొదటగా కలిశారు. అనంతరం స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్నా.. తమ బంధాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే ఇప్పుడు పెళ్లితో ఒక్కటవ్వనున్నారు.