సినిమా

సెంచ‌రీ కొట్టిన అజిత్ ‘విశ్వాసం’

త‌ల అజిత్ సినిమాల కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారనే సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న పింక్ రీమేక్‌గా ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వంలో నెర్కొండ పార్వాయి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ నిర్మిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన అజిత్ చివ‌రి చిత్రం విశ్వాసం మ‌రో మైల్ స్టోన్ అందుకుంది. జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. త‌మిళ‌నాడులోని ప‌లు థియేట‌ర్‌లో ప్ర‌స్తుతం ఈ చిత్రం స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లోను విడుద‌ల చేశారు . అక్క‌డ కూడా ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. విశ్వాసం చిత్రంలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.