తెలంగాణ

సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో నరసింహన్‌ను జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో కూడా జగన్‌ సమావేశం కానున్నారు. ఢిల్లీలో రెండు రాష్ట్రాల అధికారుల భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాల ఎజెండాను సీఎంలు ఖరారు చేయనున్నారు.
ఇదిలా ఉంటే సాయంత్రం జగన్.. కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం పర్యటనకు వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు జెరూసలేంలో పర్యటించనున్నారు. అనంతరం తిరిగి ఐదో తేదీ మధ్యాహ్నం అమరావతికి చేరుకోనున్నారు. ఈనెల 6న ఢిల్లీలో ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ ప్లాంట్‌, రామాయప ట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ సహా విభజన చట్టంలోని హామీల అమలుకు సహకరించాలని కోరుతూ జగన్ ఓ వినతి పత్రం సమర్పించనున్నారు.