క్రైమ్సినిమా

సినిమారంగం మ‌త్తు వ‌దిలిస్తా- కేతిరెడ్డి

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ను కుదిపేసిన మాధకద్రవ్యాల కేస్ లో సి.బి.ఐ. దర్యాప్తు ను కోరుతూ సినీ నిర్మాత. దర్శకుడు .తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థపక అధ్యక్షుడు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో ని ధర్మాసనం సోమవారం తిరిగి విచారించినారు.ఈ ధర్మాసనం గతంలో కేంద్ర ప్రభుత్వం ను మాధకద్రవ్యాల వాడకం ను అరికట్టేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి వాటిని అమలుచేయలని ఆదేశించినది ,అందుకు కొంత గడువును ప్రభుత్వ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ మనిందర్సింగ్ కొరటం జరిగింది .ఆ గడువు ముగిసి సోమవారం  తిరిగి విచారణ కు ధర్మాసనం ముందుకు ఈ కేసు నేడు  వచ్చింది..ఈ కేసు విచారణ కు  పిటిషనర్ తరపు నాయవాది శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు .వారితో పాటు Aims డైరెక్టర్ తరపున నాయ్యవాది దుష్యంత్ పరిషర్ పాల్గొన్నారు ,ఈ విధివిధానాలను రూపొందించుటకు కొంచెం టైమ్ కావాలని కోరారు .నాయమూర్తి వారు చెప్పిన వాటిని విన్న తరువాత ఈ కేసు ను ఫిబ్రవరి 10 కి వాయిదా వేయడం జరిగింది.

 పిటిషన్ దాఖలు చేసిన సినీ నిర్మాత ,దర్శకుడు .తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ కేసు సంభందించిన వివరాల ను తెలుపుతూ “తాను ఒక చిత్ర నిర్మాత గా,దర్శకుడు గా ఈ కేసు ను సుప్రీంకోర్టు నందు దాఖలు చేయుటకు గల ప్రధాన కారణం ,పరిశ్రమ లో ఉన్న కొందరు చేసిన తప్పుకు సినిమా పరిశ్రమ ను నిందించడం, అసలు ఈ కేసు లో పరిశ్రమ కు చే0దిన వ్యక్తుల ప్రమేయం ఉన్నదా ? లేద ? ఈ డ్రగ్ మాఫియా కు చిత్ర పరిశ్రమ కు చెందిన వారి సంబంధాలను నిగ్గు తేల్చుటకు సి.బి.ఐ చె సమగ్ర దర్యాప్తు చేపించలని మొట్టమొదటి గా ప్రధానమంత్రి ని  కొరటం జరిగిందని,ఆ తర్వాత సుప్రీం కోర్టు నందు సి.బి.ఐ .దర్యాప్తు ,సమగ్రా చట్టాల రూపకల్పన కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని, తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల తో పాటు మిగతా కేంద్ర ప్రభుత్వం తో పాటు మొత్తం 18 రాష్ట్రలను  ప్రతివాదులు గా చేర్చి కేసు వేయటం జరిగిందని,ఈ పిటిషన్ లో ప్రధానంగా సి.బి.ఐ దర్యాప్తు తో పాటు చలనచిత్ర ల్లో ,టీ. వి.లలో మాధకద్రవ్యాల వాడకం సన్నివేశాలు ఉండకూడదని ,పుబ్స్ యందు ఈ మాధకద్రవ్యాల అమ్మకం ప్రస్తుతం  జరుగుతుందని ఒక దర్యాప్తు లో  తెలిసిందని,కావున పుబ్స్ పై ప్రత్యేక  నిఘా ఏర్పాటు చేయాలని ,పాఠశాల విద్యార్థుల కొరకు మాధకద్రవ్యాల వాడితే కలుగు ఇబ్బందులను తెలుపుటకు,పాఠంల రూపంలో ,చర్చ గోష్ఠుల రూపంలో వారికి తెలియ చేయుటకు  చర్యలు తీసుకోవాలని, మాధకద్రవ్యాలను వాడేవాళ్లపై ,అమ్మువాళ్లపై,కఠిన  శిక్షలు అమలుపరుచుటకు ఒక బలమైన  కొత్త చట్టాన్ని రూపొందించలని,మాధకద్రవ్యాల వాడకం ను నిరోధించడం లో ప్రభుత్వలకు చిత్త శుద్ది లేదని ,ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఈ మాధకద్రవ్యాలను చాలా తక్కువ మంది వాడేవారని కానీ ఇప్పుడు చిన్న పిల్లలు, యువకులు ,అన్ని వర్గాల ప్రజలు ఈ మాధకద్రవ్యాల బారిన పడుతున్నారని,దీనిని అరికట్టేందుకు చట్టాలు సరిగా లేని కారణన విచ్చలవిడి వాడకం భారతదేశం లో జరుగుతుందని ,డ్రగ్ రహిత భారత నిర్మాణం కొరకు మనమందరం కలిసి కట్టుగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని, సమాజానికి తమ సినిమాలు ద్వారా నీతిని బోధించే సినిమా వారే నీతి తప్పి బరి తేగించి ఈ డ్రగ్స్ ను  వాడడం ఎంత వరకు కరెక్ట్ అని వారు తెలుసుకోవాలని,,భారత దేశంలో విదేశస్థులు ఎక్కువ మంది చదువుల పేరుతో దేశం లో జొరబడి ఈ డ్రగ్స్ రవాణా కు మూలకారణం గా ఉన్నారు ,దేశంలో ఎంత మంది విదేశస్థులు ఉన్నారో అన్న కచ్చితమైన లేకలు ప్రభుత్వల  వద్ద లేవని ,ముంబయి ,గోవా , హైదరాబాద్ లో విదేశస్థులు చదువుల పేరు తో వచ్చి  డ్రగ్స్ దందా చేసుతున్నారని, రాష్ట్ర,ప్రభుత్వ లు చట్టాలు సరిగా లేక ప్రైక్షక పాత్ర పోషించుచున్నాయని,.ఇవ్వన్ని కూడా రాబోయే రోజుల్లో దేశ భద్రత కు విఘాతం కల్పించే శక్తుల కుట్ర లో భాగమేనని   ,ప్రస్తుతం తాను డ్రగ్ రహిత భారత నిర్మాణం లో భాగంగా నాయ్యపోరాటం చేసుతున్నానని ,త్వరలో ధర్మపోరాటం చేసే0దుకు సిద్ధంగా ఉన్నామని ,ఆందుకు ప్రజలందరూ ఈ ఉద్యమం లో భాగస్వామ్యలు అయ్యి మాధకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తన విన్నపం అని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు ,

Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
Latest Posts